షాకింగ్ న్యూస్.. సూపర్‌స్టార్ రజనీకి గాయాలు | Rajini Kanth injured in 2.0 shooting | Sakshi
Sakshi News home page

షాకింగ్ న్యూస్.. సూపర్‌స్టార్ రజనీకి గాయాలు

Dec 3 2016 11:36 PM | Updated on Sep 4 2017 9:49 PM

షాకింగ్ న్యూస్.. సూపర్‌స్టార్ రజనీకి గాయాలు

షాకింగ్ న్యూస్.. సూపర్‌స్టార్ రజనీకి గాయాలు

డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ 2.0. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి గాయమైంది.

డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ 2.0. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని రజనీకాంత్ అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్లిపోయారని సమాచారం. రజనీకి గాయమైందన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆయన గత చిత్రం కబాలి విడుదలకు ముందు కూడా ఆయన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే.

2.0 షూటింగ్ సెట్లో ఓ కీలక సన్నివేశం చిత్రిస్తుండగా రజనీకాంత్ కుడికాలికి గాయమైందని మూవీ యూనిట్ తెలిపింది. వర్షం కారణంగా మెట్లపై నడుస్తుండగా ఒక్కసారిగా జారి పడిపోయారు. చెన్నై, కెలంబాక్కం సమీపంలోని ఓ ఐటీ కంపెనీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని మూవీ యూనిట్ తెలిపింది. గాయమైన వెంటనే సూపర్‌స్టార్‌ను హాస్పత్రికి తరలించి చికిత్స అందించారని, ఆస్పత్రి నుంచి రజనీ నేరుగా ఇంటికెళ్లి పోయారని చెప్పారు.  చికిత్స అందించిన డాక్టర్లు, మూవీ యూనిట్ మాట్లాడుతూ.. రజనీ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ పోషించగా, రజనీకి జోడిగా అమీ జాక్సన్ నటిస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ 400 కోట్లకు చేరడంతో ఆసియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాగానూ 2.0 రికార్డుగా నిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement