సెన్సార్‌ ఇబ్బందుల్లో ‘రక్తం’ | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ ఇబ్బందుల్లో ‘రక్తం’

Published Wed, Feb 13 2019 4:53 PM

Rajesh Touchriver Award Winning Movie RAKTHAM Goes to Tribunal - Sakshi

ప్రముఖ ద‌ర్శకుడు, జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డు గ్రహీత  రాజేష్ ట‌చ్రివ‌ర్  త‌ను రూపొందించిన ర‌క్తం చిత్రానికి సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాల‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు, ఐదు నామినేషన్‌లకు ఎంపికైన ఈ చిత్రంపై సెన్సార్ స‌భ్యులు తెలిపిన అభ్యంత‌రాలు సంతృప్తిక‌రంగా లేవ‌ని ఆయ‌న అన్నారు. ఎలాంటి అస‌భ్యత లేకుండా, మాన‌వీయ కోణంలో చిత్రీరించిన ఈ చిత్రానికి సెన్సార్ స‌భ్యులు చెప్పిన అభ్యంత‌రాలు స‌రైన‌వి కావు.

2(12) గైడ్ లైన్స్ ప్రకారం క‌ట్స్‌ ఇచ్చామ‌ని రిపోర్ట్ పంపించారు. వాళ్లు సూచించిన గైడ్ లైన్స్ చ‌ద‌వ‌గానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇద్దరు విప్లవ‌కారుల మ‌ధ్య జ‌రిగే సీరియ‌స్ సంభాష‌ణ అది. వాళ్లు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం సెక్స్‌వ‌ల్ గా త‌ప్పుదారి ప‌ట్టించేదేంటో నాకు అర్థం కాలేదు.  సామాజిక ప‌రివ‌ర్తన కోసం ర‌క్తం చిందించ‌డం అవ‌స‌ర‌మా? అనే సెన్సిబుల్‌ క‌థంశంతో సాగే ఈ చిత్రానికి  సెన్సార్ సభ్యలు చెప్పిన అభ్యంత‌రాలు చిత్ర క‌థ‌ను చిన్నాభిన్నం చేసేలా వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్రిబ్యున‌ల్‌ను ఆశ్రయించనున్నామన్నారు. ఈ చిత్రంలో బెన‌ర్జీ, సంజు శివ‌రామ్‌, మ‌ధుశాలినీ, స‌న‌, జాన్ కోటోలీ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Advertisement
Advertisement