పాత్ర కోసం మార్పు | Sakshi
Sakshi News home page

పాత్ర కోసం మార్పు

Published Fri, Oct 4 2019 2:14 AM

Rajendra Prasad Climax is getting ready - Sakshi

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్‌’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్‌’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్‌ రెడ్డి, కె.కరుణాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్‌ సెటైర్‌ నేపథ్యంలో నడిచే మర్డర్‌ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్‌రెడ్డి. ఈ సినిమాకు రాజేష్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement