తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు | Rajasthan Government Given a Tax Exemption for the Movie Sand Ki Ankh | Sakshi
Sakshi News home page

తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు

Oct 11 2019 2:26 PM | Updated on Oct 11 2019 2:54 PM

Rajasthan Government Given a Tax Exemption for the Movie Sand Ki Ankh - Sakshi

సాక్షి, సినిమా : హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్‌ సిస్టర్స్‌ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం సాండ్‌ కి ఆంఖ్‌. తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తూ, అరవైయేళ్ల బామ్మలుగా నటించారు. తుషార్‌ హీరానందని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి అశోక్‌ గెహ్లాట్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చిం‍ది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించింది. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ 20 మిలియన్ల వ్యూస్‌ను దాటి దూసుకెళ్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement