దేవసేన.. రేపే విడుదల! | rajamouli to release devasena anushka poster on wednesday | Sakshi
Sakshi News home page

దేవసేన.. రేపే విడుదల!

May 5 2015 5:11 PM | Updated on Sep 3 2017 1:29 AM

దేవసేన.. రేపే విడుదల!

దేవసేన.. రేపే విడుదల!

బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రల పోస్టర్లు ఒక్కోటిగా విడుదల చేస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. అందులోని హీరోయిన్ అనుష్క పోషిస్తున్న 'దేవసేన' పోస్టర్ను బుధవారం విడుదల చేయనున్నారు.

బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రల పోస్టర్లు ఒక్కోటిగా విడుదల చేస్తున్న ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. అందులోని హీరోయిన్ అనుష్క పోషిస్తున్న 'దేవసేన' పోస్టర్ను బుధవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాజమౌళి వెల్లడించారు. సోమవారం ఆయన విడుదల చేసిన హీరో ప్రభాస్ 'శివుడు' పోస్టర్ అటు సోషల్ మీడియాలోను, ఇటు మీడియాలో కూడా బాగా హిట్టయింది.

దానికి కృతజ్ఞతలు చెబుతూనే 'దేవసేన' అనుష్క పోస్టర్ను బుధవారం విడుదల చేస్తున్న విషయాన్ని తెలిపారు. వాస్తవానికి దేవసేన పాత్ర ప్రధానంగా బాహుబలి రెండో భాగంలో ఉంటుంది. అయితే మొదటి భాగంలో కూడా వేరే అవతారంలో కొద్దిసేపు అనుష్క కనిపిస్తుందని జక్కన్న చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement