రాజా ది గ్రేట్‌ అవుతుంది | raja the great team visit dwaraka thirumala | Sakshi
Sakshi News home page

రాజా ది గ్రేట్‌ అవుతుంది

Oct 17 2017 12:50 PM | Updated on Oct 17 2017 12:50 PM

raja the great team visit dwaraka thirumala

మద్ది క్షేత్రంలో హీరోయిన్‌ మెహ్రీన్, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి

ద్వారకాతిరుమల : రాజా ది గ్రేట్‌ సినిమాను అన్ని వర్గాల ప్రజలు ద గ్రేట్‌ అనేలా నిర్మించామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న దీపావళి సెంటిమెంట్‌ను తాను బ్రేక్‌చేసి విజయాన్ని పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాజా ది గ్రేట్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు సోమవారం సందడి చేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని శ్రీవారికి అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులు దిల్‌రాజు, హీరోయిన్‌ మెహ్రీన్‌కౌర్, దర్శకుడు రావిపూడి అనిల్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్‌లతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. హీరో రవితేజ అద్భుతంగా నటించారని దిల్‌రాజు అన్నారు. ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఎల్‌వీఆర్‌ (ఏలూరు), సీతారామ్‌ తదితరులున్నారు.  

మద్ది హనుమను దర్శించుకున్న చిత్ర యూనిట్‌
జంగారెడ్డిగూడెం రూరల్‌: గుర్వాయిగూడెంలోని  మద్ది ఆంజనేయస్వామిని సోమవారం రాజా ది గ్రేట్‌ చిత్ర యూనిట్‌ బృందం దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో హీరోయిన్‌ మెహ్రీన్‌ మాట్లాడుతూ ఈ చిత్రం  విజయవంతం కావాలని మద్ది ఆంజనేయస్వామిని మొక్కుకున్నానన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement