రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

Raj Tharun, Konda Vijaykumar's Film In KK Radhamohan's Production Is Titled As Orey   Bujjigaa - Sakshi

ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్‌ టైగర్‌, పంతం వంటి సూపర్ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ మరో చిత్రాన్ని ప్రకటించారు.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే ఆసక్తికర టైటిల్‌ను నిర్ణయించినట్టుగా తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ, ‘ రాజ్ తరుణ్, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్ లో మా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 ప్రారంభించాం. ఈ చిత్రానికి  ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాం. ఈ రోజు నుండి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్ లో ఒరేయ్.. బుజ్జిగా మరో మంచి హిట్ చిత్రం అవుతుంది’. అన్నారు.

ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి అనూప్‌ సం‍గీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top