దృష్టి ఎవరి పైన? | Rahul Ravindran's ‘Drishti’ Movie First Look Release | Sakshi
Sakshi News home page

దృష్టి ఎవరి పైన?

Sep 10 2017 1:04 AM | Updated on Sep 19 2017 12:35 PM

దృష్టి ఎవరి పైన?

దృష్టి ఎవరి పైన?

‘అందాల రాక్షసి, అలా ఎలా?’ సినిమాల ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఎమ్‌స్క్వేర్‌ పతాకంపై మోహన్‌ నిర్మించిన సినిమా ‘దృష్టి’.

‘అందాల రాక్షసి, అలా ఎలా?’ సినిమాల ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఎమ్‌స్క్వేర్‌ పతాకంపై మోహన్‌ నిర్మించిన సినిమా ‘దృష్టి’. ప్రముఖ హీరోయిన్‌ సమంత ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథకు తగ్గ పర్‌ఫెక్ట్‌ టైటిల్‌ కుదిరింది. ‘దృష్టి’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టామనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. రాహుల్‌ను ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు.

షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలో ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. పావనీ గంగిరెడ్డి హీరోయిన్‌గా, ‘వెన్నెల’ కిశోర్, సత్య ప్రకాశ్, రవి వర్మ, ప్రమోదిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీనివాస్‌ మోతుకూరి, కథ: బి. భానుకిరణ్, కూర్పు: ఉద్ధవ్‌ ఎస్‌.బి., కెమెరా: పి. బాలరెడ్డి, సంగీతం: నరేశ్‌ కుమారన్‌.

Advertisement
 
Advertisement
Advertisement