సుశాంత్‌ ఆత్మహత్య: రాహుల్‌ ట్వీట్‌, ట్రోల్‌

Rahul Gandhi Did Not Call Sushant A Cricketer Tweet Is Fake - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణావార్త యావత్‌ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అతడి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు. అయితే కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ పేరిట ఓ ట్వీట్‌ తెగ వైరల్‌ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అయితే ఆ ట్వీట్‌ ఫేక్‌ అని తేలింది. (అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!)

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ట్వీట్‌

ఇంతకీ ఏంజరిగిందంటే.. సుశాంత్‌ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. అయితే సుశాంత్‌ను క్రికెటర్‌ అన్నారంటూ ఓ స్క్రీన్‌ షాట్‌ తెగ వైరల్‌ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. అయితే దీనిపై వేగంగా స్పందించిన రాహుల్‌ ఫాలోవర్స్‌.. వెంటనే అసలు ట్వీట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చూసి, అది ఫేక్‌ అని​ పేర్కొన్నారు. దీంతో ఈ చిన్నిపాటి వివాదం సద్దుమణిగింది. ఇక ఆదివారం తన నివాసంలో సుశాంత్‌ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (సుశాంత్‌ సింగ్‌ విశేషాలెన్నో!)

రాహుల్‌ గాంధీ చేసిన అసలు ట్వీట్‌ ఇది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top