‘నువ్వు మాస్ అయితే నేను డబుల్‌ మాస్‌’ | Raghava Lawrence And Oviya Kanchana 3 Telugu Trailer | Sakshi
Sakshi News home page

‘నువ్వు మాస్ అయితే నేను డబుల్‌ మాస్‌’

Mar 28 2019 12:44 PM | Updated on Oct 16 2024 11:32 AM

వరుసగా హారర్‌ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్‌ రాఘవా లారెన్స్‌ మరోసారి భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ముని’ సిరీస్‌లో ‘కాంచన 3’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు.

తాజాగా సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ముని సిరీస్‌లోని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింతగా భయపెడుతుందంటున్నారు చిత్రయూనిట్. లారెన్స్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహన్‌ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement