ఖోఖో నేపథ్యంలో... | radhera teaser launch by vv vinayak | Sakshi
Sakshi News home page

ఖోఖో నేపథ్యంలో...

Dec 24 2019 12:04 AM | Updated on Dec 24 2019 12:04 AM

radhera teaser launch by vv vinayak - Sakshi

రథేరా

పూల సిద్ధేశ్వర్‌ రావ్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రథేరా’. జాకెట్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. పూల సిద్ధేశ్వర్‌ రావ్, నరేష్‌ యాదవ్, వై.ఎస్‌.కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. సిద్ధేశ్వర్‌ రావ్‌ మాట్లాడుతూ– ‘‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న చిత్రమిది. క్రీడా నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన వీవీ వినాయక్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘రథేరా’  సినిమాను చూసిన కొందరు సినీ ప్రముఖులు బాగుందన్నారు. రిలీజ్‌ తర్వాత ప్రేక్షకుల నుంచి అదే స్పందన వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు జాకెట్‌ రాకేష్‌.

Advertisement
 
Advertisement
Advertisement