సరికొత్త హారర్‌ | Ra Ra Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

సరికొత్త హారర్‌

Feb 19 2018 1:07 AM | Updated on Feb 19 2018 1:07 AM

Ra Ra Movie Pre Release Event - Sakshi

విజయ్, నాని, శ్రీమిత్ర చౌదరి, శ్రీకాంత్, తరుణ్, విజీ చెర్రిష్‌

శ్రీకాంత్‌ , నాజియా జంటగా విజీ చెర్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రా.. రా’. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్‌ విజన్స్‌పై విజయ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘హారర్‌ జోనర్‌లో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇప్పటి వరకూ హారర్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినా ‘రా..రా’ సరికొత్తగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది.  మమ్మల్ని సపోర్ట్‌ చేయడానికి వచ్చిన నాని, తరుణ్‌తో పాటు అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.


‘‘అష్టా చమ్మా’ నుంచి శ్రీకాంత్‌గారితో నాకు మంచి పరిచయం ఉంది. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఆయనకి ‘రా.. రా’ మరో పెద్ద హిట్‌ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘శ్రీకాంత్‌గారితో 24 సంవత్సరాల అనుబంధం ఉంది. నా బ్రదర్‌లాంటి వ్యక్తి. ఆయన వంటి సీనియర్‌ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీమిత్ర చౌదరి. నిర్మాత విజయ్, సంగీత దర్శకుడు షకీల్, హీరో తరుణ్, నటులు అలీ, రఘుబాబు, నటి హేమ, నిర్మాత అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement