కంచె వేస్తున్నారు! | putting the fencing | Sakshi
Sakshi News home page

కంచె వేస్తున్నారు!

Feb 27 2015 10:30 PM | Updated on Sep 2 2017 10:01 PM

కంచె వేస్తున్నారు!

కంచె వేస్తున్నారు!

‘వీడు ఆరడుగుల బుల్లెట్టు...’ అని ‘అత్తారింటికి దారేది’లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ పాట ఉంటుంది. బాబాయే కాదు..

‘వీడు ఆరడుగుల బుల్లెట్టు...’ అని ‘అత్తారింటికి దారేది’లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ పాట ఉంటుంది. బాబాయే కాదు.. అబ్బాయి కూడా ఆరడుగుల బుల్లెట్టే అని ‘ముకుంద'లో వరుణ్ తేజ్‌ను చూసినవాళ్లు అన్నారు. మంచి ఎత్తు, ఎత్తుకి తగ్గ బరువుతో.. ఒక మంచి మాస్ హీరో ఎలా ఉండాలో వరుణ్ అచ్చంగా అలా ఉంటాడు. లుక్‌పరంగా మార్కులు కొట్టేసిన వరుణ్ నటనపరంగా కూడా భేష్ అనిపించుకున్నాడు. తొలి చిత్రంతో పాస్ అయిన ఉత్సాహంతో ఈ యువ హీరో కొన్ని రోజులుగా మలి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఆ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారనీ, ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందనీ వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో పేర్కొనడంతో పాటు, క్లాప్ బోర్డ్ ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ క్లాప్ బోర్డ్‌పై ‘కంచె' అని రాసి ఉంది. మరి.. ఇది వర్కింగ్ టైటిలా? లేక దీన్నే ఖరారు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement