పూరి 'మూడు కోతులు.. ఒక మేక' | Puri Jagannath New Movie Moodu Kothulu Oka Meka | Sakshi
Sakshi News home page

పూరి 'మూడు కోతులు.. ఒక మేక'

Dec 7 2016 10:21 AM | Updated on Mar 22 2019 1:53 PM

పూరి 'మూడు కోతులు.. ఒక మేక' - Sakshi

పూరి 'మూడు కోతులు.. ఒక మేక'

పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు

పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు. మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్. సినిమా మేకింగ్ లోనే కాదు, సినిమా టైటిల్ ఎంపికలో కూడా పూర్తి కొత్తదనం చూపిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు పోకిరి, దేశముదురు లాంటి టైటిల్స్ పెట్టాలన్న, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది.

ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement