'ఆ సినిమా మా జీవితాలను కూడా మార్చేసింది' | Puri Jagannadh tweet about RGV, Nag new Movie | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా మా జీవితాలను కూడా మార్చేసింది'

Nov 21 2017 11:01 AM | Updated on Jul 15 2019 9:21 PM

Puri Jagannadh tweet about RGV, Nag new Movie - Sakshi

శివ సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జునల కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభమైంది. శివ సినిమా ప్రారంభమైన 28 ఏళ్ల తరువాత ప్రారంభమైన ఈ సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యం ప్రస్తుతం వర్మ ఉన్న పరిస్థితుల్లో నాగ్ లాంటి సీనియర్ హీరో ఆయనకు డేట్స్ ఎలా ఇచ్చాడన్న అనుమానం కలుగుతోంది. వరుస ఫ్లాప్ లతో వివాదాలతో వర్మ కెరీర్ దారుణంగా పడిపోయింది.

అయితే ఈ సినిమాతో తనలో జ్యూస్ ఇంకా అయిపోలేదని ప్రూవ్ చేస్తానంటున్నాడు వర్మ. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు వర్మ శిష్యులు కూడా హజరయ్యారు. ఈ సినిమా పై స్పందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ' శివ మా అందరి జీవితాలను మార్చేసింది. నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో మరో సినిమా రావటం ఎంతో ఆనందంగా ఉంది. మరో బ్లాక్ బస్టర్ హిట్ రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ మా సొంత ఇళ్లులాగే అనిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు. పూరి ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement