పూరి నెక్ట్స్ ‘వాస్కోడగామా’ | Puri Jagannadh Next Titled Vasco Da Gama | Sakshi
Sakshi News home page

Sep 5 2018 1:52 PM | Updated on Sep 5 2018 7:38 PM

Puri Jagannadh Next Titled Vasco Da Gama - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్‌ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట.

తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement