సల్మాన్‌తో పూరి సినిమా? | Puri Jagannadh new movie with Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌తో పూరి సినిమా?

May 25 2020 12:29 AM | Updated on May 25 2020 12:30 AM

Puri Jagannadh new movie with Salman Khan - Sakshi

పూరి జగన్నాథ్‌, సల్మాన్‌ ఖాన్‌

గత ఏడాది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆ జోష్‌తోనే విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్‌’ అనే ప్యాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. సల్మాన్‌ కోసం పూరి తన స్టయిల్లో ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ను రెడీ చేశారట.

ప్రస్తుతం సల్మాన్‌తో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సల్మాన్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నారని టాక్‌. ‘ఫైటర్‌’ తర్వాత పూరి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తారట. గతంలో అమితాబ్‌ బచ్చన్‌తో ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ సినిమాను హిందీలో తీశారు పూరి. అలాగే సల్మాన్‌ కెరీర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బూస్ట్‌ ఇచ్చిన ‘వాంటెడ్‌’ పూరి జగన్నాథ్‌ తీసిన ‘పోకిరి’కి రీమేక్‌ అని తెలిసిందే. మరి ఇప్పుడు ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే ఆ సినిమా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement