పూరీ చేతుల మీదుగా సాంగ్‌ లాంచ్‌ | Puri Jagannadh Launched Anaganaga O Premakatha First Song | Sakshi
Sakshi News home page

పూరీ చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ సాంగ్‌ లాంచ్‌

Sep 26 2018 1:56 PM | Updated on Sep 26 2018 2:05 PM

Puri Jagannadh Launched Anaganaga O Premakatha First Song - Sakshi

విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. కె.సతీష్ కుమార్ సమర్పణలో  టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్‌గా పేరుపొందిన  నిర్మాత  కె ఎల్ యన్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజా ఈ సినిమాలోని నిను విడువనులే పాటను డాషింగ్  డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల చేసారు . ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజు  గారితో  అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి సినిమాకు పని చేశాను. మళ్ళీ అయనతో సినిమా చేయాలనుకున్న కానీ రాజు గారు ఇతర బిజినెస్‌లలో బిజీ అయిపోయారు.

చాలా రోజులు తరవాత ‘అనగనగ ఓ ప్రేమకథ’ అనే సినిమా ని నిర్మించారు నాకు చాలా ఆనందంగా ఉంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారితో నేను చాలా సినిమాలకు పని చేశాను.తప్పకుండా విరాజ్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్‌కి బెస్ట్ విషెస్ చెపుతూ, ఈ సినిమా హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నా’ అన్నారు.

తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement