సంగీతం నేపథ్యంలో... | Puri Jagannadh Launched Aagraham Motion Poster | Sakshi
Sakshi News home page

సంగీతం నేపథ్యంలో...

Apr 19 2019 12:35 AM | Updated on Apr 19 2019 12:35 AM

Puri Jagannadh Launched Aagraham Motion Poster - Sakshi

పూరి జగన్నాథ్, సురేశ్, సందీప్, మూర్తి

సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్‌సింగ్‌ ముఖ్య తారలుగా ఆర్‌.ఎస్‌ సురేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగ్రహం’. ఎస్‌.ఎస్‌ చెరుకూరి క్రియేషన్స్‌ పతాకంపై సందీప్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. సురేష్‌ మాట్లాడుతూ– ‘‘సంగీతానికి ప్రాధాన్యం ఉన్న విభిన్న కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే ఆఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన పూరి జగన్నాథ్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్‌ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌  మూర్తి ఆడారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్‌.కె, సంగీతం: ఆర్‌.ఆర్‌.రవిశంకర్‌. 

Advertisement
 
Advertisement
Advertisement