'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ పోస్టర్ విడుదల
పూరి జగన్నాథ్ 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ పోస్టర్ విడుదల చేశారు.
హైదరాబాద్: పూరి జగన్నాథ్ 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఛార్మి కళ్లుమూసుకుని తన్మయత్వంతో శాక్సాఫోన్ వాయిస్తున్నట్టు ఇందులో చూపారు. పూరి జగన్నాథ్ తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను రెండు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ పోస్టర్ లో ఛార్మి ఫోజు బాగుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.


