పూరి, బాలకృష్ణల సినిమా ప్రారంభం | Puri Jagannadh, Bala krishna Movie Opening | Sakshi
Sakshi News home page

పూరి, బాలకృష్ణల సినిమా ప్రారంభం

Mar 9 2017 10:53 AM | Updated on Sep 5 2017 5:38 AM

పూరి, బాలకృష్ణల సినిమా ప్రారంభం

పూరి, బాలకృష్ణల సినిమా ప్రారంభం

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 101వ సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 101వ సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను కూకట్పల్లి తులసీ వనం టెంపుల్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న బాలయ్య పూరి దర్శకత్వంలో సినిమాచేసేందుకు అంగీకరించాడు. వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ప్రస్తుతం ఇషాన్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య పూరిల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement