చాటింగ్‌తో లాభం! | Profit for chatting! | Sakshi
Sakshi News home page

చాటింగ్‌తో లాభం!

Jun 26 2014 12:30 AM | Updated on Sep 2 2017 9:23 AM

చాటింగ్‌తో లాభం!

చాటింగ్‌తో లాభం!

నేటి తరం ఎక్కువగా అంకితం అవుతున్నవాటిలో ఆన్‌లైన్ చాటింగ్ ఒకటి. చాటింగ్ ద్వారా కొన్ని చీటింగ్స్ జరుగుతాయని అంటారు. కానీ, దానివల్ల లాభం చేకూరుతుందనే కథాంశంతో లావణ్య చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’.

నేటి తరం ఎక్కువగా అంకితం అవుతున్నవాటిలో ఆన్‌లైన్ చాటింగ్ ఒకటి. చాటింగ్ ద్వారా కొన్ని చీటింగ్స్ జరుగుతాయని అంటారు. కానీ, దానివల్ల లాభం చేకూరుతుందనే కథాంశంతో లావణ్య చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత మరసీయర్ జంటగా టీయస్ కమల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

వచ్చే నెల 4న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇదొక యూత్‌ఫుల్ లవ్, కామెడీ ఎంటర్‌టైనర్. చాటింగ్ వల్ల జరిగే మంచిపనులను చూపించే చిత్రం. జయంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement