సీకే లావణ్యకు మేయర్‌ సీటు ఎలా ఇస్తారు? | YV Rajeshwari Fire On CK Lavanya | Sakshi
Sakshi News home page

సీకే లావణ్యకు మేయర్‌ సీటు ఎలా ఇస్తారు?

Oct 15 2026 8:35 AM | Updated on Oct 15 2026 8:41 AM

YV Rajeshwari Fire On CK Lavanya

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కూటమిలో మేయర్‌ సీటును సీకే కుటుంబానికి ఇవ్వకూడదని, బీసీలో మంచి నాయకుడిని ఎంపిక చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. ఆమె బుధవారం చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 

మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబానికి మేయర్‌ సీటు కేటాయిస్తే అరాచకాలు జరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు. 2003లో టీడీపీ ప్రభుత్వం హయాంలో తన కుమారుడు రవిశంకర్‌ చౌదరి హత్యకు గురయ్యాడని, అందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సీకేబాబుపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాంటి వ్యక్తి కుటుంబానికి చెందిన లావణ్యకు మేయర్‌ సీటు ఎలా కేటాయిస్తారని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

 పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక బాధలను ఎదుర్కొని అంకితభావంతో కష్టపడిన సీనియర్‌ నాయకులు, త్యాగాలు చేసిన వారిని విస్మరించకూడదని కోరారు. అవసరానికి తగినట్లు పార్టీలు, కండువాలు మార్చే వారిని నమ్మి పదవులు కట్టబెడితే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు బయట ఎలా తిరుగుతారని నిలదీశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి.. బీసీ వర్గాలకు సముచిత స్థానాన్నికల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement