కన్‌ఫ్యూజన్‌ వద్దని.. | Producer Dil Raju Press Meet About Tholi Prema | Sakshi
Sakshi News home page

కన్‌ఫ్యూజన్‌ వద్దని..

Feb 1 2018 12:18 AM | Updated on Feb 1 2018 12:18 AM

Producer Dil Raju Press Meet About Tholi Prema - Sakshi

బీవీయస్‌యన్‌ ప్రసాద్, ‘దిల్‌’ రాజు

వరుణ్‌ తేజ్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవియస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘తొలి ప్రేమ’. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ రెండు సినిమాలను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. దాంతో రెండు చిత్రాల నిర్మాతలు డిస్కస్‌ చేసుకొని ‘తొలిప్రేమ’ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి డిసైడ్‌ అయ్యారు. ఈ సందర్భంగా బీవియస్‌యన్‌ ప్రసాద్, ‘దిల్‌’ రాజు విలేకరులతో మాట్లాడారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘కష్టపడి సినిమా చేశాక రెవెన్యూ తెచ్చుకోవడం ముఖ్యం. అందుకని ప్రసాద్‌గారు ‘తొలిప్రేమ’ సినిమాను 10న రిలీజ్‌  చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు సినిమాలు వేగంగా చేస్తున్నారు.

దాంతో ప్రతి శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకని క్లాష్‌ ఏర్పడుతోంది. నేను ‘తొలి ప్రేమ’ చూశాను. ప్రసాద్‌గారి బ్యానర్‌లో వచ్చిన ‘డార్లింగ్, అత్తారింటికి దారేది’లాగా మంచి సక్సెస్‌ సాధిస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌గా లాస్ట్‌ ఇయర్‌ ఫెయిలయ్యాను. ఈ ఇయర్‌ ‘భాగమతి’తో హిట్‌ సాధించాను. ‘తొలిప్రేమ’ కూడా సక్సెస్‌ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామనుకున్నాం. అదే రోజు ‘ఇంటిలిజెంట్‌’ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. వరుణ్, ధరమ్‌తేజ్‌ ఫ్యాన్స్‌ మధ్య కన్ఫ్యూజన్‌ ఏర్పడకూడదని ‘దిల్‌ ’ రాజుగారితో  మాట్లాడి ఫిబ్రవరి 10న విడుదలను ప్లాన్‌ చేశాం’’ అని బీవియస్‌యన్‌ ప్రసాద్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement