ఐస్ బకెట్ చాలెంజ్ కు ప్రియాంక చోప్రా నో! | Priyanka not interested ALS Ice Bucket Challenge | Sakshi
Sakshi News home page

ఐస్ బకెట్ చాలెంజ్ కు ప్రియాంక చోప్రా నో!

Aug 24 2014 6:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఐస్ బకెట్ చాలెంజ్ కు ప్రియాంక చోప్రా నో! - Sakshi

ఐస్ బకెట్ చాలెంజ్ కు ప్రియాంక చోప్రా నో!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు సై అంటుంటే.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం విముఖత వ్యక్తం చేసింది.

ముంబై: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ చాలెంజ్ కు సెలబ్రిటీలు సై అంటుంటే.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం విముఖత వ్యక్తం చేసింది. ఈ నటిని చాలామంది ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించాలని నామినేట్ చేసినా ఆమె అందుకు ఆసక్తి కనబరచలేదు.ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్, బిపాస్ బసూ, అభిషేక్ బచ్చన్, సన్నీ లియోన్ తదితరులు ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రాకు ఎందుకో ఈ షోపై అంతగా ఆసక్తి లేనట్టుంది. ప్రియాంక పేరును పలువురు అభిమానులు ప్రపోజ్ చేసినా.. ఆమె మాత్రం నో అంటోంది.


అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్‌ఎస్) అనేది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. దీనివల్ల మనిషి జీవచ్ఛవంలా మారతాడు. మన దేశంలో అంతగా కన్పించని ఈ వ్యాధి, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందట. ఇంతవరకు దీనికి కారణాలు కనుక్కోలేదు. ఈ ఛాలెంజ్ తో  ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చి ఆ వ్యాధి పరిశోధనకు విరాళాలే సేకరించడమే ఈ చాలెంజ్ ప్రధాన ఉద్దేశం.

Advertisement
 
Advertisement
Advertisement