'ఆమె డేట్లు దొరికితే షూటింగ్ స్టార్ట్' | Priyanka has put India on global platform, says Bhandarkar | Sakshi
Sakshi News home page

'ఆమె డేట్లు దొరికితే షూటింగ్ స్టార్ట్'

Sep 15 2015 8:02 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఆమె డేట్లు దొరికితే షూటింగ్ స్టార్ట్' - Sakshi

'ఆమె డేట్లు దొరికితే షూటింగ్ స్టార్ట్'

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి భారతీయులు గర్వపడాలని దర్శకుడు, నిర్మాత మధూర్ బండార్కర్ వ్యాఖ్యానించాడు.

ముంబయి :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చూసి భారతీయులు గర్వపడాలని దర్శకుడు, నిర్మాత మధూర్ బండార్కర్ వ్యాఖ్యానించాడు. 'ఫ్యాషన్' నటి మన సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందంటూ ప్రశంసలజల్లులు కురిపించారు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక విజయాలను చూసి దేశం గర్వించాలన్నాడు. ఆమె విజయాలు భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా చేశాయని పేర్కొన్నాడు. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించేందుకు ఇష్టపడే హీరోయిన్లలో ప్రియాంక ఒకరన్న విషయం తెలిసిందే.

అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో ఆమె ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. బండార్కర్ తన తదుపరి మూవీ ప్రియాంకతో చేయనున్నట్లు చెప్పాడు. ఆమెతో 'మేడమ్జీ' అనే ప్రాజెక్టు చేస్తానని, ఈ మూవీ నా జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుందన్నాడు. ప్రియాంకకు కథ చాలా నచ్చిందని, నాలాగే తాను కూడా మూవీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఆమె డేట్లు దొరకకపోవడంతో షూటింగ్ ప్రారంభించలేదని, 60 రోజుల్లో ప్రాజెక్టు పూర్తవుతుందన్నాడు. ఈ 25న విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీ 'క్యాలెండర్ గర్ల్స్' ప్రమోషన్లలో దర్శకుడు బండార్కర్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement