ప్రియాంక హ్యాట్సాఫ్.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ప్రశంస! | Priyanka Chopra's Mary Koms Theatrical trailer gave goosebumps | Sakshi
Sakshi News home page

ప్రియాంక హ్యాట్సాఫ్.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ప్రశంస!

Jul 23 2014 3:10 PM | Updated on Sep 15 2019 12:38 PM

ప్రియాంక హ్యాట్సాఫ్.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ప్రశంస! - Sakshi

ప్రియాంక హ్యాట్సాఫ్.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ప్రశంస!

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రాను ఓ అందాల తారగానే పరిగణించారు.

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రాను ఓ అందాల తారగానే పరిగణించారు. త్వరలో రాబోతున్న మేరికామ్ చిత్రంతో ప్రియాంక చోప్రా తనేంటో అనే సత్తాను టీజర్ లో రుచి చూపించారు. తాజాగా విడుదలైన మేరికామ్ చిత్ర టీజర్  ప్రేక్షకులు, సినీ అభిమానులను రోమాలు నిక్కబొడిచే విధంగా ఉందని కితాబిచ్చారు. మేరికామ్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ నటులు,టాలీవుడ్ నటులు చేరిపోయారు. మేరికామ్ టీజర్ చూసి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లు ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. 
 
మేరికామ్ థియేటర్ ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అద్బుతంగా నటించింది. పాత్ర కోసం ప్రియాంక చూపిన అంకితభావానికి తలవంచాల్సిందే. స్పూర్తిగా నిలిచింది అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. 
 
రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తెరపై ప్రియాంక చోప్రా సీతాకోకచిలుకలో దూసుకుపోయింది అంటూ ఆయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు. 
Advertisement
 
Advertisement
Advertisement