ఈ ఫోటో చూడొద్దు! | Priyanka Chopra suffering from conjunctivitis | Sakshi
Sakshi News home page

ఈ ఫోటో చూడొద్దు!

Oct 21 2014 4:05 PM | Updated on Sep 2 2017 3:13 PM

ఈ ఫోటో చూడొద్దు!

ఈ ఫోటో చూడొద్దు!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలకు దూరమైంది. కండ్లకలక కారణంగా పండుగ జరుపుకోలేకపోతున్నట్టు ఆమె తెలిపింది.

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలకు దూరమైంది. కండ్లకలక కారణంగా పండుగ జరుపుకోలేకపోతున్నట్టు ఆమె తెలిపింది. ఈ మాజీ ప్రపంచ సుందరి ప్రస్తుతం సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో నటిస్తోంది. అయితే కండ్ల కలక కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కూడా రద్దు చేసుకుంది.

'షూటింగ్ రద్దు. దీపావళి రద్దు. కండ్ల కలక కారణంగా ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నా' అని ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. ఉబ్బిపోయిన కళ్లతో తన ఫోటో కూడా ట్విటర్ లో పోస్ట్ చేసింది 32ఏళ్ల ప్రియాంక చోప్రా. అయితే ఈ ఫోటో వంక చూడొద్దని ఇక్కడ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement