ప్రియాంకా ఆయా | Priyanka Chopra to play Salman Khan’s leading lady in Bharat | Sakshi
Sakshi News home page

ప్రియాంకా ఆయా

Apr 19 2018 12:50 AM | Updated on Apr 19 2018 12:50 AM

Priyanka Chopra to play Salman Khan’s leading lady in Bharat - Sakshi

సల్మాన్‌ఖాన్‌, ప్రియాంకా చోప్రా

రెండేళ్లు గడిచిపోయింది ప్రియాంకా చోప్రా హిందీ సినిమాలో నటించి. ‘జై గంగాజల్‌’ ( 2016) ప్రియాంకా నటించిన చివరి హిందీ సినిమా. అలాగే పదేళ్లు ముగిసిపోయాయి సల్మాన్‌ ఖాన్‌తో కలసి ప్రియాంక నటించి. ‘గాడ్‌ తుస్సీ గ్రేట్‌ హో’ (2008) బాలీవుడ్‌లో ప్రియాంకా, సల్మాన్‌ఖాన్‌ కలిసి నటించిన చివరి సినిమా. ఇక్కడితో ఈ గ్యాప్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు ఇద్దరు. యస్‌.. ప్రియాంక బాలీవుడ్‌లో నటించనున్న నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్వకత్వంలో రూపొందుతున్న ‘భరత్‌’ సినిమాలోనే. అంటే.. రెండేళ్లుగా ఎవరు పిలిచినా బాలీవుడ్‌కు రాని ప్రియాంకా.. భరత్‌ పిలవగానే ఆయా.

అదేనండీ.. సల్మాన్‌ ఖాన్‌ పిలవగానే వచ్చారు. 2014లో వచ్చిన కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ సినిమాకు ‘భరత్‌’ చిత్రం రీమేక్‌. 1947 నుంచి 2000 టైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుంది. ‘‘భరత్‌’ సినిమాతో మీ ఇంటికి (బీటౌన్‌) తిరిగొస్తున్నందుకు శుభాకాంక్షలు. త్వరలో కలుద్దాం.. అన్నట్లు ఇంకో మాట మనది హిందీ సినిమా’’ అని ప్రియాంకకు సరదాగా సల్మాన్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ‘‘ నేనేప్పుడూ ఇక్కడి అమ్మాయినే. ‘భరత్‌’ సెట్స్‌లో కలుసుకుందాం. ఈ సినిమాలో నటించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రియాంక. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement