చోప్రా సిస్టర్స్‌ మాట సాయం | Priyanka Chopra, Parineeti to lend voice to Hindi version of Frozen 2 | Sakshi
Sakshi News home page

చోప్రా సిస్టర్స్‌ మాట సాయం

Oct 19 2019 2:04 AM | Updated on Oct 19 2019 2:37 AM

Priyanka Chopra, Parineeti to lend voice to Hindi version of Frozen 2 - Sakshi

ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా

ఇటీవల హాలీవుడ్‌ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్‌ స్టార్స్‌తోనూ ప్రమోట్‌ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్‌ చిత్రం ‘ఫ్రాజెన్‌ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్‌ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్‌’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్‌లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్‌ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్‌ ఓవర్‌ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్‌ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్‌ 22న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement