చెప్పులరిగాయి కానీ..! | Priyanka Chopra joins the big league in New York | Sakshi
Sakshi News home page

చెప్పులరిగాయి కానీ..!

May 8 2016 11:06 PM | Updated on Oct 17 2018 4:36 PM

చెప్పులరిగాయి కానీ..! - Sakshi

చెప్పులరిగాయి కానీ..!

పాపం ప్రియాంకా చోప్రా న్యూయార్క్‌లో రోడ్లు మీద కాళ్లు కందేలా, చెప్పులు అరిగేలా తిరుగుతున్నారట.

పాపం ప్రియాంకా చోప్రా న్యూయార్క్‌లో రోడ్లు మీద కాళ్లు కందేలా, చెప్పులు అరిగేలా  తిరుగుతున్నారట. ఉన్న చెప్పులు అరిగిపోవడంతో రెండు జతల చెప్పులు కూడా కొనుక్కోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఈ బ్యూటీకి అంత కష్టం ఏమొచ్చింది? మరేం లేదు.. న్యూయార్క్‌లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారట. అందుకే ఇళ్ల వేటలో బిజీగా ఉన్నారు. అక్కడ ఎందుకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారంటే..అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో పాటు ‘బేవాచ్’ అనే హాలీవుడ్  చిత్రంలో ప్రియాంక నటిస్తున్నారు.

ఈ షూటింగ్స్ నిమిత్తం న్యూయార్క్ వెళ్లినప్పుడల్లా హోటల్‌లో బస చేయాల్సి వస్తోందట. ఖర్చు నిర్మాతదే అయినా.. సేఫ్టీ మాటేంటి? రహస్య కెమెరాలున్నాయేమో అన్నది ఆమె భయం. అందుకే ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందని అనుకున్నారట. మరి.. ఇల్లు దొరికేదెప్పుడో? ప్రియాంక ఓ ఇంటిది అయ్యేదెప్పుడో?

Advertisement
 
Advertisement
Advertisement