ప్రియాంకకు 1.30 కోట్ల మంది అభిమానులు | Priyanka Chopra ecstatic with 13 million followers on Twitter | Sakshi
Sakshi News home page

ప్రియాంకకు 1.30 కోట్ల మంది అభిమానులు

Mar 4 2016 4:12 PM | Updated on Sep 3 2017 7:00 PM

ప్రియాంకకు 1.30 కోట్ల మంది అభిమానులు

ప్రియాంకకు 1.30 కోట్ల మంది అభిమానులు

హాలీవుడ్ రంగప్రవేశం చేసిన తర్వాత.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు అభిమానులు పెరిగిపోయారు. ట్విట్టర్‌లో ఆమెకు ఇప్పుడు 1.30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

హాలీవుడ్ రంగప్రవేశం చేసిన తర్వాత.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు అభిమానులు పెరిగిపోయారు. ట్విట్టర్‌లో ఆమెకు ఇప్పుడు 1.30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమె మియామీ ప్రాంతంలో 'బేవాచ్' షూటింగులో బిజీగా ఉంది. అంతలోనే ఈ విషయం తెలిసిన అమ్మడు.. తెల్లటి దుస్తులు వేసుకుని, మియామీ బీచ్‌ వద్ద తన సంతోషాన్ని పంచుకుంది.

సముద్రం ఒడ్డున నిలబడి.. 13 మిలియన్ అని ఇసుకలో రాసి.. అంతెత్తున ఎగిరింది. కానీ ఆమె ఎగిరి, కిందకు మళ్లీ వచ్చేలోపే కెరటం వచ్చి, ఆమె 13 మిలియన్ రాతను చెరిపేసింది. తనకు 1.30 కోట్ల మంది అభిమానులు ఉన్నారని తెలియడం చాలా సంతోషంగా ఉందని, తన క్రేజీ రైడ్ మరింతగా కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేసింది. క్వాంటికో టీవీ కార్యక్రమంలో నటించినప్పటి నుంచి ప్రియాంకా చోప్రా బాగా పాపులర్ అయ్యింది. బే వాచ్‌లో ఆమె నెగెటివ్ పాత్ర ధరిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా నటించిన 'జై గంగాజల్' సినిమా శుక్రవారమే విడుదలైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement