ఇంటి ఖరీదు 140 కోట్లు | Priyanka and Nick are looking for a new home, the budget is 140 crores | Sakshi
Sakshi News home page

ఇంటి ఖరీదు 140 కోట్లు

Aug 8 2019 2:32 AM | Updated on Aug 8 2019 2:32 AM

Priyanka and Nick are looking for a new home, the budget is 140 crores - Sakshi

మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ కొనబోతున్న ఇంటి ఖరీదు దాదాపు 140 కోట్లు అని సమాచారం. గత ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయ్యాక లాస్‌ ఏంజిల్స్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ఉన్న నిక్‌ ఇంట్లో ఈ దంపతులు ఉంటూ వచ్చారు. ఆ ఇంటి ఖరీదు దాదాపు 50 కోట్లు అట. 5 పడక గదులు, 5 బాత్రూమ్‌లు, ఈత కొలను.. ఇలా హంగామా ఉన్న ఆ ఇంటిని ఇటీవల అమ్మేశారట నిక్‌. ఇదే పెద్ద ఇల్లు అంటే ఇంతకన్నా పెద్ద ఇంటికి మారాలని ఈ క్రేజీ కపుల్‌ అనుకున్నారని హాలీవుడ్‌ కథనం.

బెవెర్లీ హిల్స్‌లోనే సుమారు 140 కోట్లు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేయబోతున్నారట. అయితే తన సోదరులతో కలిసి నిక్‌ జోనస్‌ ‘హ్యాపీనెస్‌ బిగిన్స్‌ టూర్‌’ ప్లాన్‌ చేశారు. ఈ మ్యూజికల్‌ టూర్‌ కోసం నిక్‌ పలు ప్రదేశాలను సందర్శిస్తారు. అందుకని కొత్త ఇల్లు కొనుక్కుని, తమ అభిరుచికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి టైమ్‌ పడుతుంది కాబట్టి వచ్చే ఏడు నిక్, ప్రియాంక గృహప్రవేశం అవుతారని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంకా చోప్రా నటించిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంకొన్ని చిత్రాలకు సైన్‌ చేశారామె.

Advertisement
 
Advertisement
Advertisement