కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

Priyanka Agrawal Entering Into Tollywood With a Comedy Film - Sakshi

మళయాల సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘1971బెయాండ్‌ బార్డర్స్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక అగర్వాల్‌ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌కు స్ట్రయిట్‌ సినిమాతో పరిచయం అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ కథా కథనాలు అందిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. సప్తగిరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవల తమిళనాడు కంచిలో ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top