బాహుబలి సెట్లో ప్రియమణి | Priyamani Visits Baahubali Sets | Sakshi
Sakshi News home page

బాహుబలి సెట్లో ప్రియమణి

Jun 14 2016 1:06 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి సెట్లో ప్రియమణి - Sakshi

బాహుబలి సెట్లో ప్రియమణి

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఈ సినిమాకు సంబందించిన ఏదో ఒక...

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి పార్ట్ 2 రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ సెట్లో జరుగుతున్న విశేషాలు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ఐడి కార్డు ఉన్నవారిని తప్ప ఇతరులను సెట్ లోకి అనుమతించటం లేదు.

అయితే ఇంత స్ట్రిక్ట్గా భారీగా తెరకెక్కుతున్న బాహుబలి సెట్లో.. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కోరిక సామాన్యులతో పాటు సినీ తారలకు కూడా కలుగుతోంది. అయితే అందరూ వెళ్లలేకపోయినా ఓ సౌత్ బ్యూటీ మాత్రం బాహుబలి సెట్లోకి అడుగుపెట్టింది. జక్కన్న దర్శకత్వంలో యమదొంగ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రియమణి, బాహుబలి షూటింగ్ స్పాట్లో సందడి చేసింది. రాజమౌళితో ఉన్న స్నేహం కారణంగానే ప్రియమణికి ఈ అవకాశం లభించింది. అయితే షూటింగ్ చూసొచ్చిన ప్రియమణి, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నా.. సినిమాకు  సంబంధించిన విశేషాలను మాత్రం సీక్రెట్ గానే ఉంచింది.

Advertisement
 
Advertisement
Advertisement