ప్రియమైన బిజీ

Priya Bhavani Shankar next film with Vikram - Sakshi

న్యూస్‌ ప్రెజెంటర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన ప్రియా భవానీ శంకర్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో మంచి జోష్‌ మీద ఉన్నారు. ‘మేయాద మాన్‌’ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ గతేడాది ‘కడైకుట్టి సింగమ్‌’ (తెలుగులో ‘చినబాబు’) సినిమాతో తెలుగు ఆడియన్స్‌ కూడా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్‌లో భారీ ఆఫర్స్‌ దక్కించుకుంటున్నారు. ఇటీవలే కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’లో కీలక పాత్రకు ఊ కొట్టిన ప్రియ తాజాగా విక్రమ్‌ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారట. ఈ చిత్రానికి అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక ‘మాఫియా’, ‘వాన్‌’ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు ప్రియ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top