ప్రస్తుతం సినిమాల మీదే: జయప్రద | present only cinemas not politics says jayaprada | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం సినిమాల మీదే: జయప్రద

Jun 8 2015 8:39 PM | Updated on Aug 28 2018 4:30 PM

మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని నటి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని నటి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు. తాను తెలుగు నటిని కావడంతో సహజంగానే తెలుగులో నటించాలనే ఆసక్తి ఉంటుందన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్నానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement