'ధృవ' ప్రీ-లుక్ | Pre-Look: Dhruva's Enemy Is His Strength | Sakshi
Sakshi News home page

'ధృవ' ప్రీ-లుక్

Aug 12 2016 5:42 PM | Updated on Sep 4 2017 9:00 AM

నా శత్రువే నా బలం అంటున్నాడు హీరో రామ్ చరణ్. తమిళ్ ‘తనీ ఒరువన్’కు రీమేక్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ’.

నా శత్రువే నా బలం అంటున్నాడు హీరో రామ్ చరణ్. తమిళ్ ‘తనీ ఒరువన్’కు రీమేక్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ’. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ గత చిత్రాలు కాస్త నిరాశ పరచడంతో మెగా ఫ్యాన్స్ 'ధృవ' మీద ఆశలు పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో చరణ్.. పోలీస్ ఆఫీసర్గా అలరించనున్నాడు. శుక్రవారం చిత్ర ప్రీ లుక్ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న ఈ లుక్ను రిలీజ్ చేయనున్నారు. రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement