breaking news
Pre-look poster
-
ఆయనెవరో ఊహించండి!
నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సందీప్ కిషన్ నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలు నిర్మిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు సందీప్. తాజాగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారాయన. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై నిర్మాత పి. కిరణ్ సమర్పణలో వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై సందీప్ కిషన్ , శినీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఓ ప్రముఖ సహాయ నటుడు ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతున్నారు. ఆయనెవరో ఊహించండి?’’ అంటూ ఈ సినిమా ప్రీ–లుక్‌ని సోమవారం విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు హీరో, హీరోయిన్ , ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివా చెర్రీ, సీతారామ్. -
'ధృవ' ప్రీ-లుక్
నా శత్రువే నా బలం అంటున్నాడు హీరో రామ్ చరణ్. తమిళ్ ‘తనీ ఒరువన్’కు రీమేక్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ధృవ’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ గత చిత్రాలు కాస్త నిరాశ పరచడంతో మెగా ఫ్యాన్స్ 'ధృవ' మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో చరణ్.. పోలీస్ ఆఫీసర్‌గా అలరించనున్నాడు. శుక్రవారం చిత్ర ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న ఈ లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.