బంధాలను గుర్తు చేసేలా... | Prati roju panduga look release | Sakshi
Sakshi News home page

బంధాలను గుర్తు చేసేలా...

Sep 13 2019 2:53 AM | Updated on Sep 13 2019 2:53 AM

Prati roju panduga look release - Sakshi

సాయి తేజ్‌, సత్యరాజ్

మారుతి దర్శకత్వంలో సాయి తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.  రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నటులు సత్యరాజ్, రావు రమేష్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌కేఎన్‌ సహ–నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్‌లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్‌ ఉన్న లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.

Advertisement
 
Advertisement
Advertisement