ప్రభుదేవా, విజయ్‌లతో దేవి సీక్వెల్‌ | Prabhudeva and Vijay's combination of Devi-2 movie | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా, విజయ్‌లతో దేవి సీక్వెల్‌

Sep 21 2017 3:56 AM | Updated on Sep 22 2017 11:19 AM

Prabhudeva and Vijay's combination of Devi-2 movie

ప్రభుదేవా, విజయ్‌ల కాంబినేషన్‌లో దేవి–2 చిత్రం తెరక్కెనుందా? ఆ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. ప్రభుదేవా కోలీవుడ్, టాలీవుడ్‌లను దాటి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ క్రేజీ దర్శకుడిగా పేరు తెచుకున్నారు.

తమిళసినిమా:   ప్రభుదేవా, విజయ్‌ల కాంబినేషన్‌లో దేవి–2 చిత్రం తెరక్కెనుందా? ఆ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. ప్రభుదేవా కోలీవుడ్, టాలీవుడ్‌లను దాటి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ క్రేజీ దర్శకుడిగా పేరు తెచుకున్నారు. ఆ తరువాత దేవి చిత్రంతో హీరోగా మళ్లీ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి విజయ్‌ దర్శకుడు. దేవి చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఎండ్‌ చేయకుండా పార్టు–2 వస్తుందనే సిగ్నల్‌ను ప్రేక్షకులకు ఇచ్చారు. దేవి చిత్రం తరువాత దర్శకుడు విజయ్, ప్రభుదేవా ఎవరి చిత్రాలతో వారు బిజీ అయిపోయారు.

విజయ్‌ జయంరవి హీరో వనమగన్‌ చిత్రాన్ని చేసి ప్రస్తుతం సాయిపల్లవి ప్రధాన పాత్రలో కరు అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభుదేవా యంగ్‌ మంగ్‌ చంగ్, గులేబాకావళి, కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో మెర్కూరి చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటించే కరుప్పురాజా వెళైరాజా చిత్రం ప్రారంభం కావలసి ఉన్నా, అది డ్రాప్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభుదేవాతో విజయ్‌ దేవి–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దర్శకుడు విజయ్, ప్రభుదేవాల మధ్య ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి  ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement