ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’

prabhu devas silent film Mercury - Sakshi

డాన్సింగ్‌ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్‌ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సంతోష్‌ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Back to Top