నయనకు విలన్‌గా ప్రభుదేవా? | Prabhu Deva in Nayanthara's film | Sakshi
Sakshi News home page

నయనకు విలన్‌గా ప్రభుదేవా?

Mar 19 2017 4:22 AM | Updated on Sep 5 2017 6:26 AM

నయనకు విలన్‌గా ప్రభుదేవా?

నయనకు విలన్‌గా ప్రభుదేవా?

నటి నయనతారకు ప్రభుదేవా విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో సంచలనంగా మారిన అంశం ఇదే. నిజా నికి ప్రభుదేవా, నయనతారల ప్రస్థావన రావడమే ఒక సంచలనం.

నటి నయనతారకు ప్రభుదేవా విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో సంచలనంగా మారిన అంశం ఇదే. నిజా నికి ప్రభుదేవా, నయనతారల ప్రస్థావన రావడమే ఒక సంచలనం. ఎందుకుంటే వీరిద్దరూ ఒకప్పుడు అందుకు కేంద్రబిందువులుగా మారారు కాబట్టి. డీప్‌గా ప్రేమించికుని పెళ్లి దాకా వచ్చి విడిపోయిన మాజీ ప్రేమజంట అన్నది అందరికీ తెలిసిందే. అంతకు ముందు మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ఇదునమ్మఆళు చిత్రంలో నటించి ఎంతగా ఆశ్చర్యం కలిగించారో తెలిసిందే.

తాజాగా మరో మాజీ ప్రియుడితో నటిస్తూ మరో షాక్‌ ఇవ్వనున్నారా? నయనతార ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో కొలైయుధీర్‌ కాలం ఒకటి. టాలీవుడ్‌ దర్శకుడు, ఉన్నైపోల్‌ ఒరువన్, బిల్లా–2 చిత్రాల ఫేమ్‌ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. హారర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీన్ని హిందీ లోనూ రీమేక్‌ చేయనున్నట్లు, అందులో నయనతార పాత్రను నటి తమన్నా పోషించనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

అదే విధంగా హిందీ వెర్షన్‌లో తమన్నకు విలన్‌గా నటుడు ప్రభుదేవా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళంలో ఆ పాత్రను పోషిస్తున్నదెవరన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశాన్ని దర్శక నిర్మాతలు రహస్యంగానే ఉంచారు. ప్రభుదేవాకు హిందీలో మాదిరిగానే దక్షిణాదిలోనూ మంచి మార్కెట్‌ ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.

అందువల్ల తమిళంలో కొలైయుధీర్‌ కాలం చిత్రంలో నయనతారకు విలన్‌గా ప్రభుదేవానే నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంచలన చిత్రం ద్వారా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన గానీ, దర్శకుడు చక్రీ తోలేటిగానీ సరైన వివరణ ఇచ్చే వరకూ ఇలాంటి ఊహాజనిత ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement