‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌! | Prabhas's Saaho Defeats Hollywood Films in Worldwide Earnings | Sakshi
Sakshi News home page

‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

Sep 4 2019 10:49 AM | Updated on Sep 4 2019 10:49 AM

Prabhas's Saaho Defeats Hollywood Films in Worldwide Earnings - Sakshi

ప్రభాస్‌, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో మరో నటుడికి సాధ్యం కానీ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ప్రభాస్‌, సాహోతో వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

తొలి వారాంతంలో అంతర్జాతీయ స్థాయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో సాహో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ : హాబ్స్ అండ్ షా’ ఒక్కటే సాహో కన్నా ముందు ఉంది. ది లయన్ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ లాంటి సూపర్‌ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా సాహో తరువాతి స్థానాలతో సరిపెట్టుకోవటం విశేషం.

సెలవులు ముగియటంతో సాహో కలెక్షన్లు కాస్త స్లో అయినా ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాహో ముందు ముందు మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement