అమ్మతో సినిమా చూడటానికి ప్రభాస్ సంకోచం | Prabhas Wants Baahubali-2 with his mom | Sakshi
Sakshi News home page

అమ్మతో సినిమా చూడటానికి ప్రభాస్ సంకోచం

Apr 26 2017 8:34 PM | Updated on Sep 5 2017 9:46 AM

అమ్మతో సినిమా చూడటానికి ప్రభాస్ సంకోచం

అమ్మతో సినిమా చూడటానికి ప్రభాస్ సంకోచం

ప్రభాస్ తన సినిమాను చూడాల్సిన అత్యంత ముఖ్యమైన తొలి వ్యక్తి, ఆమె కావాలని కోరుకుంటున్నారు.

బాహుబలి-2 ఇంకొన్ని గంటల్లో థియేటర్ల ముందుకు రాబోతుంది. గురువారం ముంబైలో ప్రీమియర్ షోకు షెడ్యూల్ బుక్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోగా ప్రధాన పాత్ర పోషించిన ప్రభాస్ తన సినిమాను చూడాల్సిన అత్యంత ముఖ్యమైన తొలి వ్యక్తి, ఆమె కావాలని కోరుకుంటున్నారు. ఆమె ఎవరో తెలుసా? ప్రభాస్ తల్లి శివ కుమారి అట. అయితే తన ఫిల్మ్ మొదట తన తల్లినే చూడాలని భావిస్తున్న ప్రభాస్ మాత్రం ఆమెతో కలిసి సినిమా చూడటానికి సంకోచిస్తున్నాడట. దీనికి గల ప్రధాన కారణం వెనువెంటనే ఫీడ్ బ్యాక్ ను పొందడాన్ని ప్రభాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.
 
బాహుబలి: ది కన్క్లూజన్ పార్ట్ ను ఎంజాయ్ చేసే వారిలో తొలి వ్యక్తి తన అమ్మనే కావాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా తల్లి అభిప్రాయం కోసం కూడా ప్రభాస్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది. కానీ తన తల్లి పక్కనే కూర్చుని వెనువెంటనే ఫీడ్ బ్యాక్ పొందడానికి మాత్రం సంకోచిస్తున్నాడని ఫిల్మ్ వర్గాల టాక్. దేశవ్యాప్తంగా దాదాపు 8000 స్క్రీన్లపై బాహుబలి: ది కన్క్లూజన్ ను ప్రదర్శించబోతున్నారు. తెలుగుతో పాటు తమిల్, హిందీ, మలయాళంలో ఇది స్క్రీన్లపైకి వస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement