జపాన్‌లో సాహో | Prabhas upcoming movie to release in Japanese | Sakshi
Sakshi News home page

జపాన్‌లో సాహో

Apr 5 2019 3:52 AM | Updated on Jul 17 2019 10:14 AM

Prabhas upcoming movie to release in Japanese - Sakshi

ప్రభాస్‌

‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఇంటర్‌నేషనల్‌ లెవల్‌కి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్‌ను బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇండియాలో రిలీజ్‌ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను జపనీస్‌లో కూడా రిలీజ్‌ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.

ఆల్రెడీ జపాన్‌లోని ఓ లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌కు ‘సాహో’ రైట్స్‌ను కూడా ఇచ్చేశారని తెలిసింది. ‘బాహుబలి’ చిత్రం కూడా జపాన్‌లో విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక... ‘సాహో’ చిత్రం షూటింగ్‌ విశేషాలకు వస్తే.... ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్‌–బ్రిటిష్‌ పాప్‌ సింగర్, నటి కైలీ మినాగ్‌  ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘బ్లూ’ సినిమాలోని ‘చిగ్గీ.. విగ్గీ’ అనే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించారు కైలీ. ‘సాహో’ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్‌–ఎహాసన్‌–లాయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement