50 ఇయర్స్‌ స్పెషల్‌ | Prabhas teams up with Mahanati director Nag Ashwin | Sakshi
Sakshi News home page

50 ఇయర్స్‌ స్పెషల్‌

Feb 27 2020 5:47 AM | Updated on Feb 27 2020 5:47 AM

Prabhas teams up with Mahanati director Nag Ashwin - Sakshi

ప్రభాస్, అశ్వనీదత్, నాగ్‌ అశ్విన్‌

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ 50వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా బుధవారం స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ తెరకెక్కించిన నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. తండ్రి అశ్వనీదత్‌తో కలసి స్వప్నా దత్, ప్రియాంకా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌. ప్రస్తుతానికి సినిమా గురించి ఏం చెప్పదల్చుకోలేదు. ఇది ప్యాన్‌ ఇండియన్‌ సినిమా కాదు.. ప్యాన్‌ వరల్డ్‌ సినిమా’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement