మొదలైన చోటే ముగింపు

prabhas sahoo final schedule shooting completed in mumbai - Sakshi

షూటింగ్‌లో ‘సాహో’ టీమ్‌ ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చేసినట్లుంది. అందుకోసం ముంబైలో మకాం వేసింది ‘సాహో’ టీమ్‌. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ముంబైలోని పలు  లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నారట. ‘‘ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. ముంబైలో ‘సాహో’ షూటింగ్‌’’ అని దర్శకుడు సుజిత్‌ పేర్కొన్నారు. అంటే.. ఈ షెడ్యూల్‌తో ‘సాహో’ చిత్రీకరణ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అవుతుందని ఊహించవచ్చు.

ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టింది ముంబైలోనే అట. అందుకే మొదలుపెట్టిన చోటే ముగింపు అని సుజీత్‌ అని ఉంటారు. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్‌–ఎహసన్‌–లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top