ఇటలీలో ప్రభాస్‌ ప్రేమకథ

Prabhas Next Goes Floors In Italy - Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీజయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్‌ మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రం జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు ప్రభాస్‌.

ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇటలీలో షూట్‌ చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌ కూడా ఇటలీ చేరుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాధకృష్ణ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top