ప్రభాస్ సాహో లుక్ ఇదేనా..? | Prabhas new slim Stylish Look | Sakshi
Sakshi News home page

ప్రభాస్ సాహో లుక్ ఇదేనా..?

Jun 3 2017 12:42 PM | Updated on Sep 5 2017 12:44 PM

ప్రభాస్ సాహో లుక్ ఇదేనా..?

ప్రభాస్ సాహో లుక్ ఇదేనా..?

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు రెడీ

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. బాహుబలి రిలీజ్ తరువాత నెల రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేసి వచ్చిన డార్లింగ్, ఇప్పుడు మేకోవర్ మీద దృష్టి పెట్టాడు. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రభాస్ ఫోటో ఒకటి సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీం ప్రభాస్తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పేజ్లో షేర్ చేశాడు.

కాస్త సన్నబడి, డిఫరెంట్ హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్గా కనిపిస్తున్న ఈ లుక్ నెక్ట్స్ సినిమా సాహో కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. 150 కోట్ల బడ్జెట్తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ విలన్గా నటిస్తుండగా హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement